కార్బన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌..ధరలు? | Karbonn Aura Sleek 4G, Aura Note 4G Budget Smartphones Launched | Sakshi
Sakshi News home page

కార్బన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌..ధరలు?

Published Tue, Mar 21 2017 6:13 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

Karbonn Aura Sleek 4G, Aura Note 4G Budget Smartphones Launched



న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ మొబైల్‌  కంపెనీ  కార్బన్‌ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లతో 4 జీ మొబైల్స్‌లోకి విస్తరించింది. ఔరా సిరీస్‌ లో కొత్త 4 జీ స్మార్ట్‌ ఫోన్లను తాజాగా లాంచ్‌ చేసింది. ఔరా స్లీక్‌ 4జీ, ఔరా నోట్‌ 4జీ పేర్లతో  సరికొత్త డివైస్‌ లను బడ్జెట్‌ధరల్లో లాంచ్‌ చేసింది.   అతి వేగవంతమైన 4 జీ పెర్‌ ఫార్‌ఫామెన్స్‌తో తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తెచ్చినట్టుకంపెనీ  ప్రకటించింది. ఔరా స్లీక్‌ 4జీ  ధరను రూ. 5,290 గాను,  ఔరా నోట్‌ 4జీ ధరను రూ. 6,890గా  నిర్ణయించింది. అయితే వీటి విక్రయ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

ఔరా స్లీక్‌ 4 జీ
5 అంగుళాల ఐపిఎస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌  6.0 మార్ష్మల్లౌ
1.25గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్‌
8 జీబీ స్టోరేజ్‌
32 జీబీ  ఎక్స్‌పాండబుల్‌
5 ఎంపీ రియర్‌ కెమెరా
2ఎంపీ ఫ్రంట్‌  కెమెరా
2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
బ్లాక్  అండ్‌ షాంపైన్‌ వైట్‌ లో  ఈ హ్యాండ్‌ సెట్‌ లభించనుంది.



ఔరా నోట్‌ 4 జీ
5,5 హెచ్‌డీ డిస్‌ప్లే
1.25గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్,
16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
32 ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌   కెమెరాలు
2800 ఎంఏహెచ్‌ బ్యాటరీ
మెటల్‌ బ్లాక్‌,  మెటాలిక్‌ షాంపైన్ కలర్స్‌లో ఇది లభ్యంకానుంది. అయితే ఈ రెండుడివైస్‌లలోనూ  యాక్సిలోమీటర్‌, ప్రాక్సిమిటీ, లైట్‌ సెన్స్‌ర్ ను అమర్చినట్టు  కంపెనీ    చెబుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement