
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
నిజానికి వన్‌ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్‌లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment