
న్యూఢిల్లీ: కొత్త ఫోన్ కొన్న స్నేహితుడి నుంచి చిన్న పార్టీ ఆశించి భంగపడిన తోటి స్నేహితులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషాద ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నిందితులు ముగ్గురు 9వ తరగతి చదివే 16 ఏళ్ల టీనేజర్లు కావడం గమనార్హం. తూర్పు ఢిల్లీ పరిధిలోని షకర్‌పుర్ ప్రాంతం రాంజీ సమోసా దుకాణం దగ్గర అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది.
మంగళవారం ఢిల్లీ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈస్ట్) అపూర్వ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సచిన్ అనే 16 ఏళ్ల టీనేజర్ ఫోన్ కొనేందుకు స్నేహితుడిని వెంట తీసుకెళ్లాడు. వారికి మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నారు. కొత్త ఫోన్ చూశాక స్నేహితులంతా పార్టీ ఇవ్వాల్సిందేనని సచిన్‌పై ఒత్తిడి తెచ్చారు.
అందుకు సచిన్ ససేమిరా అన్నాడు. దీంతో మాటామాటా పెరిగింది. స్నేహితుల్లో ఒకడు సచిన్‌ను వెనుక నుంచి కత్తితో రెండుసార్లు పొడిచి హత్యచేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. రక్తమోడుతున్న సచిన్ ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటనా స్థలి మీదుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ బృందం రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను చూసి ఆగి ఆరా తీశారు. స్థానికంగా ఉండే ఆ ముగ్గురు టీనేజర్లను అరెస్ట్‌చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 103(1), 3(5) సెక్షన్లకింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. ఘటనాస్థలిలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment