దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న మైక్రోమ్యాక్స్ మరో మోడల్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంఆ చైనా ఫోన్లకు దీటుగా తక్కువ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనుంది.
మైక్రోమ్యాక్స్ నోట్ సిరీస్‌లో
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మైక్రోమ్యాక్స్ సంస్థ 2020 నవంబరులో నోట్ 1 పేరుతో స్మార్ట్‌పోన్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ మోడల్‌కి కొనసాగింపుగా నోట్ 1 ప్రో మొబైల్‌ని మార్కెట్‌లోకి తేనున్నట్టు సమాచారం. మీడియాటెక్ హెలియె G 90 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించారు. నోట్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై పని చేస్తుండగా నోట్ 1 ప్రో మొబైల్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై పని చేయనుంది. అంతేకాకుండా 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్‌సీ పోర్టుతో కొత్త ఫోన్ ఉండబోతుంది.
ధర ఎంత ?
మైక్రోమ్యాక్స్ నోట్ 1 ప్రో ధర రూ 15,000లు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి తెస్తారని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
పట్టుకోసం ప్రయత్నాలు
ఇండియన్ మార్కెట్‌లో నోకియా, శామ్‌సంగ్ హవా కొనసాగుతున్న కాలంలో వాటి తర్వాత స్థానం మైక్రోమ్యాక్స్‌దే అన్నట్టుగా ఉండేంది. ముఖ్యంగా కాన్వాస్ పేరుతో తక్కువ ధరకే స్మార్టు ఫోన్లను అందించి మార్కెట్‌ను కైవసం చేసుకుంది. అయితే మైక్రోమ్యాక్స్ తరహాలోనే చైనా కంపెనీలైన వివో, ఒప్పో, షావోమీ, రియల్‌మీలు ఇండియన్ మార్కెట్‌లో అడుగు పెట్టాయి. వీటితో పోటీ తట్టుకోలేక మైక్రోమ్యాక్స్ వెనుకబడిపోయింది. మరోసారి ఇండియన్ మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్‌లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్
Comments
Please login to add a commentAdd a comment