ఈ ఒక్క రీజన్‌తో యాపిల్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? | 63% iPhone users want to upgrade to iPhone 15; Here's the reason - Sakshi
Sakshi News home page

iPhone 15: ఈ ఒక్క రీజన్‌తో యాపిల్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? సర్వేలో తెలిసిందిదే!

Published Fri, Sep 8 2023 8:47 AM | Last Updated on Fri, Sep 8 2023 9:20 AM

63 percent apple users want to upgrade new phone check the reason - Sakshi

యాపిల్ కంపెనీ ఈనెల 12 (2023 సెప్టెంబర్ 12)న జరగబోయే ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ట్రేడ్-ఇన్ ప్లాట్‌ఫారమ్ సెల్‌సెల్ అనే కొత్త సర్వేలో ఎక్కువమంది ఈ మొబైల్ కొనటానికి కారణం USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను ప్రవేశపెట్టడమే అని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ సెల్‌సెల్ సర్వే ప్రకారం.. యాపిల్ USB-C ఛార్జింగ్ పోర్ట్‌తో ఐఫోన్ 15 మోడల్స్ అందించనుంది. ఈ కారణంగా చాలామంది కొత్త వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సుమారు 63 శాతం మంది ఐఫోన్ యూజర్లు కొత్త ఐఫోన్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

కంపెనీ యూఎస్‌బీ-సీ ఛార్జర్ ప్రవేశపెట్టడం వల్ల కేవలం ఐఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 15 శాతం ఇటువైపు మొగ్గు చూపుతారని నివేదికలు చెబుతున్నాయి. కేవలం వినియోగదారుడు మాత్రమే కాకుండా కుటుంబంలోని అందరూ ఈ ఛార్జర్ ఉపయోగించవచ్చని, ఇదీ ఒక కారణమని చెబుతున్నారు.

ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు..

2012 నుంచి యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ప్రత్యేకమైన చార్జర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూరోపియన్ యూనియన్ నిబంధనల వల్ల మొదటిసారి ఐఫోన్ 15 సిరీస్ యూఎస్‌బీ-సీ ఛార్జర్‌తో రానుంది. ఇది వినియోగదారులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement