నీతా అంబానీ మొబైల్ రూ.400 కోట్లా? నిజమెంత? | Price Of Mukesh Ambani Wife Nita Ambani Phone Is Rs 400 Crores? Is It Is Real Or Fake - Sakshi
Sakshi News home page

నీతా అంబానీ వాడే ఫోన్‌ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే?

Published Fri, Jan 26 2024 11:34 AM | Last Updated on Sat, Jan 27 2024 1:06 PM

Price Of Mukesh Ambani Wife Phone Price - Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఖరీదైన బంగ్లా, అన్యదేశ్య కార్లతో పాటు, వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్ అన్నీ కూడా వారి రేంజ్‌కు తగ్గట్టుగానే ఉంటాయి. గతంలో నీతా అంబానీ ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరిగాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నీతా అంబానీ రూ.400 కోట్లు విలువైన మొబైల్ ఉపయోగిస్తుందని గతంలో వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉపయోగిస్తుందని సమాచారం. ఈ మొబైల్ ధర రూ.159900 నుంచి రూ.199900 వరకు ఉంటుంది.

యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
భారతీయ మార్కెట్లో తయన్త ఖరీదైన మొబైల్స్ జాబితాలో ఒకటైన 'యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్'  నేచురల్ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇదీ చదవండి: రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది!

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనేది కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ17 బయోనిక్ చిప్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవి 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులను తెగ ఆకర్శించేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement