అయ్యో పాపం.. ఐఫోన్ 15 కోసం ఎంతకు తెగించారో చూడండి.. | Customers Beat Up Employees Over A Delay In The Sale Of Iphone 15 | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం.. ఐఫోన్ 15 కోసం ఎంతకు తెగించారో చూడండి..

Published Sun, Sep 24 2023 10:42 AM | Last Updated on Sun, Sep 24 2023 11:28 AM

Customers Beat Up Employees Over A Delay In The Sale Of Iphone 15 - Sakshi

టెక్‌ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్‌లు భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 23 నుంచి లభ్యం కావడంతో ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ఐఫోన్‌లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్‌ రిటైల్‌ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. విడుదలై గంటలు గడవక ముందే ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీలోని కమలా నగర్‌కు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్‌ స్టోర్‌కి కొంత మంది ఐఫోన్‌ల కోసం వచ్చారు. అయితే, ఫోన్‌ల డెలివరీ కాస్త ఆలస్యం అవుతుందని స్టోర్‌ సిబ్బంది చెప్పడంతో కోపోద్రికులయ్యారు. డెలివరీ అలస్యం అవుతుందని చెప్పిన స్టోర్‌ ఉద్యోగి దుస్తులు చించారు. ఆపై దారుణంగా కొట్టారు. స్టోర్‌లోని ఇతర సిబ్బంది వినియోగదారుల్ని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు.  

ప్రస్తుతం, ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఘటనపై స్టోర్‌ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్టోర్‌ సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డ కస్టమర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 

చదవండి : కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement