ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు | Flipkart Offering Rs 13000 Discount On iPhone | Sakshi
Sakshi News home page

ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు

Published Sun, Jan 28 2024 5:34 PM | Last Updated on Sun, Jan 28 2024 6:00 PM

Flipkart  Rs 13000 Discount On iPhone - Sakshi

యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డీల్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్‌ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్ కార్డ్‌ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!

ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement