అమెరికా నుంచి యాపిల్ (Apple) ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) మోడల్ తెప్పించుకుంటున్నారా? భారత్‌లో కంటే ధర తక్కువన్న కారణంతో అక్కడ ఉంటున్న బంధువులు, స్నేహితుల ద్వారా ఈ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
ఐఫోన్ 15 మోడల్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సహా భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఆఫ్‌లైన్ యాపిల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ఛానెల్‌లలో కస్టమర్లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. కాగా ఐఫోన్ 15 ప్రో ధర భారత్‌లో రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అయితే రూ. 1,59,900 ఉంది.
(iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో)
అదే సమయంలో ఐఫోన్ ప్రో మోడల్స్‌ను దిగుమతి చేసుకునే గ్రే మార్కెట్ ప్రాక్టీస్ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. విదేశాల్లోని తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా భారతీయ కస్టమర్లు అక్కడ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, యూఏఈ వంటి దేశాలలో ఐఫోన్ ప్రో మోడల్స్ తక్కువ ధరకు లభిస్తుండటమే దీనికి కారణం.
అమెరికా ఐఫోన్లతో ఇదే సమస్య
అయితే విదేశాల్లో లభించే ఐఫోన్‌లలో ఉండే సమస్యల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ముఖ్యమైనది ఫిజికల్ సిమ్ స్లాట్ లేకపోవడం. ప్రధానంగా యూఎస్ నుంచి కొనుగోలు చేసే ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ 15లలో ఈ-సిమ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ ఆ దేశంలో ఫిజికల్ స్లాట్‌లతో కూడిన ఫోన్‌లను విక్రయించడం ఆపేసింది.
కాబట్టి ఫిజికల్ సిమ్ స్లాట్ కావాలంటే యూఎస్ వేరియంట్‌ను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇక యూరప్, యూఏఈ వంటి ఇతర దేశాల్లో లభించే ఫోన్లకు సింగిల్ సిమ్ స్లాట్‌లు ఉంటాయి.
ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లు కావాలంటే..
హాంకాంగ్‌లో లభించే ఐఫోన్‌లు ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్‌లతో వస్తాయి. ఏకకాలంలో రెండు సిమ్ కార్డ్‌లను వీటిలో ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ భారత్‌లో విక్రయిస్తున్న ఐఫోన్ 15 ప్రో వేరియంట్‌లో కూడా లేదు. ఇందులో ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment