ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది.
ఈ సారి ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌లో సీ-టైప్ యూఎస్‌బీ చార్జింగ్‌తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్‌లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్‌లో పరిచయం చేసింది.
టైటానియం బాడీ
కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి.
పర్యావరణహితం
లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్‌స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్‌లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్‌తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్‌లను ఉపయోగించారు.
యాక్షన్ బటన్
సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్‌లలో మ్యూట్ స్విచ్‌కి బదులుగా యాక్షన్ బటన్‌ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్‌ల కోసం షార్ట్‌కట్‌గా ఉంటుంది.
Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్
కొత్త ఐఫోన్‌లు సరికొత్త Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్‌ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు.
A17 ప్రో చిప్
మొదటి 3-నానోమీటర్ చిప్‌గా పిలిచే A17 ప్రో చిప్‌ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్.
కన్సోల్ గేమింగ్
యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్‌వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి.
4K 60 FPS వీడియో రికార్డింగ్
కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్‌లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది.
24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్
ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్‌లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్‌లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్‌కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్‌ను ఇందులో ఉంది.
టెట్రాప్రిజం డిజైన్
జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్‌ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్‌తో కూడిన టెట్రాప్రిజం డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment