
నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : మహిళలను గౌరవించాలన్న సంకల్పంతోనే దీపావళిని నిర్వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా దేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్నారని తెలిపారు.
భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాయని చెప్పారు. భారతదేశ సంబరాలు దేశవిదేశాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. భారతదేశం పండుగులకు నెలవని, ఫెస్టివల్ టూరిజానికి భారత్లో అనేక అవకాశాలున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment