
సాక్షి, అమరావతి : దీపావళి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందస్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దీపావళికి సందేశాన్నిచ్చారు. దీపావళి పండుగ అంటే చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా రంగు రంగుల దీపాలను వెలిగించి ఘనంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. శాంతికి, మత సామరస్యానికి, నవ సమాజ నిర్మాణానికి ఈ దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment