సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్‌డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు.
చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment