న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి పేలుళ్ల కేసులో అరెస్టయిన ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సంస్థ ఉగ్రవాది ఫైజాన్ అహ్మద్ సుల్తాన్‌ను స్థానిక న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీదాకా పోలీస్ కస్టడీకి ఆదేశించింది. షార్జానుంచి రప్పించిన ఫైజాన్‌ను ఢిల్లీ పోలీసులు ఈ నెల ఆరంభంలో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. ఫైజాన్‌ను బుధవారం అదనపు సెషన్స్‌కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి దయాప్రకాశ్ ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచాలంటూ ఆదేశించారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితుడిని ఇంకా విచారించాల్సి ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన విన్నపాన్ని మన్నించిన న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలు జారీచేశారు.
కాగా వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న 55 ఏళ్ల సుల్తాన్‌ను అంతకుముందు అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) జాతి వ్యతిరేక యుద్ధం అనే మరొక ప్రత్యేక కేసుకు సంబంధించి విచారించింది. ఇదిలాఉంచితే 2008, సెప్టెంబర్ 13నాటి వరుస బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఐఎం సహ వ్యవస్థాపకులు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లతోపాటు మొత్తం 29 మంది నిందితులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఐఏ అప్పట్లో అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా 16 మంది నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
పోలీస్ కస్టడీకి ఐఎం ఉగ్రవాది
Published Wed, May 28 2014 10:21 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
Advertisement
Advertisement