ముంబై: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ ఉస్మానీ ముంబై పోలీసుల నుంచి శుక్రవారం తప్పించుకున్నాడు. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్‌లలో 2008లో సంభవించిన పేలుళ్ల కేసులో ఉస్మానీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌లోని తలోజా జైలు నుంచి దక్షిణ ముంబైలోని సెషన్స్ కోర్టుకు తీసుకువస్తుండగా పోలీసు చెరనుంచి ఉస్మానీ తప్పించుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు చెప్పారు.