హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కోసం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారం నెల్లాళ్ల ముందుగానే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.
ఎన్‌ఐఏ విచారణలో భత్కల్, తబ్రేజ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కోసం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారం నెల్లాళ్ల ముందుగానే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసం సృష్టించేందుకు జనవరిలోనే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లు దర్యాప్తులో వెల్లడించాడు. బాంబుల తయారీ కోసం ఒక వ్యక్తి యాసిన్ భత్కల్‌కు పేలుడు పదార్థాలను సమకూర్చినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి కోసం ఎన్‌ఐఏ అధికారులు గాలిస్తున్నారు. యాసిన్ భత్కల్ నెల్లాళ్ల ముందుగానే నగరంలో మకాం వేసినట్లు వారు అనుమానిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను బాధ్యులుగా గుర్తించారు.