అశ్లీలంలో ఐడీల గుట్టు! | IM terrorists hacked email id's | Sakshi
Sakshi News home page

అశ్లీలంలో ఐడీల గుట్టు!

Published Fri, Nov 13 2015 9:08 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

అశ్లీలంలో ఐడీల గుట్టు! - Sakshi

అశ్లీలంలో ఐడీల గుట్టు!

* ‘స్టఫ్ మై స్టాకింగ్స్’ పుస్తకం ఆధారంగా మెయిల్ ఐడీల సృష్టి
 
*  నిఘా వర్గాలకు చిక్కకుండా రూపొందించిన ఐఎం ఉగ్రవాదులు
 
*  పుస్తకం వివరాలను ఎట్టకేలకు గుర్తించిన దర్యాప్తు అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్ లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు సమాచారమార్పిడికి వినియోగించిన ఐడీలను అశ్లీల సాహిత్య పుస్తకం ఆధారంగానే సృష్టించినట్లు తేలింది.

దాదాపు ఏడాదికి పైగా ఈ పుస్తకం పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఎట్టకేలకు అది ‘స్టఫ్ మై స్టాకింగ్’గా గుర్తించాయి. పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించాడు. ఈ బాధ్యతల్ని తన సోదరుడు యాసీన్ భత్కల్‌కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్‌లను రంగంలోకి దింపాడు. సమాచారమార్పిడికి ఫోన్లపై ఆధారపడితే తేలిగ్గా నిఘా వర్గాలకు దొరికే ప్రమాదం ఉందని వాటికి పూర్తి దూరంగా ఉన్నారు.

కేవలం ఈ-మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని రియాజ్ సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే అవకాశం ఉంటుంది.  ఈ సమస్యను అధిగమించేందుకు రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తన మెయిల్ ఐడీ నుంచి మిగతా వారికి ఓ మెయిల్ పంపాడు.  

అందులో పీడీఎఫ్ ఫార్మెట్‌లో ఉన్న ఓ పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి.

ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉన్న నేపథ్యంలో ఎవరి ఐడీ ఏమిటి? అనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. ఎక్కువగా సంప్రదింపులు జరిపిన వారు ఎక్కువ ఐడీలు, తక్కువగా జరిగిన వారు తక్కువ ఐడీలు సృష్టించుకున్నారు. 2013లో యాసీన్ భత్కల్ సహా మిగిలిన ఉగ్రవాదులు అరెస్టయినప్పుడు ఓ పుస్తకం ఆధారంగా ఐడీలు సృష్టించినట్టు బయటపడింది. అయితే అది ఏ పుస్తకం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అనేక కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఆ పుస్తకం ఇంటర్‌నెట్‌లో లభిస్తున్న ‘స్టఫ్ మై స్టాకింగ్స్’గా గుర్తించాయి.
 
ఎవరు, ఏ ఐడీలు వాడారంటే..? ....
రియాజ్ భత్కల్ (సూత్రధారి):
lovesam361@yahoo.com,
patarasingh@yahoo.com,
coolallz@yahoo.com,
dumzum@paltalk.com.

యాసీన్ భత్కల్ (కీలక పాత్రధారి):
halwa.wala@yahoo.com,
jankarko@yahoo.com,
a.haddad29@yahoo.co,
hbhaddur@yahoo.com,
khalid.k@Nimbuzz.com

హడ్డీ (సహాయ సహకారాలు అందించాడు):
khalid.k@Nimbuzz,
spentthose11@yahoo.com,
tashan99@paltalk.com,
spentthose@nimbuzz.com
 
మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టాడు):
laho0@yahoo.com
 
వఖాస్ (107 బస్టాప్ వద్ద బాంబు పెట్టాడు):
Ubhot4u@yahoo.com
 
వీరు వాడిన ఇతర ఐడీలు:  
Jamesusually10, menothing1,
davidthapa77, menothing1
 
(ఇవన్నీ నింబస్‌లో),
kul.chitra@yahoo.com,
muthumamu80@yahoo.com,
jankarko@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement