రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ
Published Mon, Oct 28 2013 11:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
న్యూఢిల్లీ : పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పాట్నా బాంబు పేలుళ్ళ వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక పాట్నా పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో వందమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Advertisement