దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్ | Mumbai police gets threatening letter from Indian Mujahideen, airports alerts | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్

Published Tue, Jul 29 2014 10:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

Mumbai police gets threatening letter from Indian Mujahideen, airports alerts

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని విమానాశ్రయాలకు బాంబు దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. కారు బాంబులతో తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందంటూ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలపై దాడులకు పాల్పడతామని ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ముంబయి కమిషనర్కు లేఖ రాసింది. భారత్ లోని ముఖ్యప్రాంతాల్లో, మెట్రో నగరాల్లో బాంబులతో విధ్వంసం సృష్టిస్తామంటూ ఆ లేఖలో పేర్కొంది.

ఇండియన్ ముజాహిద్దీన్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అనువణువూ సోదాలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్ట్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పట్లను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ఢిల్లీ పోలీసులు ష్కరే తోయిబా కు చెందిన ఒక ఉగ్రవాదిని  అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్టు చేసిన ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. లష్కరే తోయిబాలో యువత చేరేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని భావిస్తున్న అబ్దుల్ సుభాన్ ను అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ బస్ స్టాండ్ వద్ద వలపన్ని పట్టుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement