బుకింగ్‌లపై బ్లూడార్ట్‌ భారీ డిస్కౌంట్‌లు | Blue Dart announces Diwali Express | Sakshi
Sakshi News home page

బుకింగ్‌లపై బ్లూడార్ట్‌ భారీ డిస్కౌంట్‌లు

Published Fri, Oct 27 2023 6:38 AM | Last Updated on Fri, Oct 27 2023 6:38 AM

Blue Dart announces Diwali Express - Sakshi

ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్‌?ప్రెస్‌ ఎయిర్‌ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్‌ సంస్థ బ్లూడార్ట్‌ ఎక్స్‌?ప్రెస్‌ లిమిటెడ్‌ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్‌?ప్రెస్‌’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్‌ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్‌మెంట్‌లపై డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్‌మెంట్‌లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్‌–డాక్యుమెంట్‌ షిప్‌మెంట్స్‌పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement