బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి | Kerala Woman deceased After Accidentally Running Into Bank Glassdoor | Sakshi
Sakshi News home page

బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి

Published Tue, Jun 16 2020 4:08 PM | Last Updated on Tue, Jun 16 2020 9:14 PM

Kerala Woman deceased After Accidentally Running Into Bank Glassdoor - Sakshi

ఎర్నాకులం : పని మీద బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా అద్దాల తలుపులకు(గ్లాస్‌ డోర్‌) తగిలి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేరళ, ఎర్నాకులంలోని పెరుంబవూర్‌కు చెందిన బీనా (46) పనిమీద సోమవారం నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకుకు వెళ్లారు. అక్కడ లావాదేవీలు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. వాహనం కీని మర్చిపోవడంతో దానికి తీసుకునేందకు మళ్లీ ఆమె బ్యాంకులోకి వెళ్లారు.

కీని తీసుకొని తిరిగివెళ్లే క్రమంలో అనుకోకుండా ఆమె గ్లాస్‌ డోర్‌కు తగిలారు. దీంతో ఆ గ్లాస్‌ డోర్‌ పగిలి పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపులో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్త్రావం కావడంతో బ్యాంకు సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.  ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎర్నాకులం మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement