glass doors
-
డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత..
ఏదో మిరాకిల్ లేక ఏదైనా దెయ్యమా! తెలియదుగానీ ఒక్కసారిగా ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయ్యింది. అదీకూడా పట్టపగలే అలా జరగడంతో.. ఒక్కసారిగా అక్కడున్న వారికెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ భయానక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..బిజ్నోర్‌లోని చెప్పులకు సంబంధించిన చైనా షాపు ఉంది దానికి సమీపంలో ఓ టాక్టర్ పార్క్ చేసి ఉంది. ఏమైందో ఏమో! హఠాత్తుగా ఆ ట్రాక్టర్ దానికదే స్టార్ట్్ అయ్యి ఆ చెప్పుల షాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆ షాప్‌లోని ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ..బయటకు వచ్చేశారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రాక్టర్ ఇంజన్ని ఆపి పెద్ద మొత్తంలో షాప్‌కి డ్యామేజ్ జరగకుండా కాపాడాడు. ఈ ఘటనలో ఆ షాపు అద్ధం మొత్తం పగిలిపోయి కొద్ది మొత్తంలో ఆ షాపు ఓనర్‌కి మాత్రం నష్టం వాటిల్లింది. దీంతో ఆ షాపు ఓనర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ ట్రాక్టర్ యజమానిపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఐతే స్థానికుల సమాచారం ప్రకారం..రాబోయే హోలీ పండుగ కోసం పోలీసులు బిజ్నోర్ పోలీస్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆ ట్రాక్టర్ యజమాని కిషన్ కుమార్ కూడా పాల్గొన్నారు. అతను తన ట్రాక్టర్ని ఈ చైనా చెప్పుల దుకాణం వద్ద పార్క్ చేశాడు. సుమారు గంట తర్వాత ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతటే అదే స్టార్ట్ అయ్యి చెప్పుల దుకాణంలోకి వచ్చేయడంతో..ఆషాపు అద్దం మొత్త పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో.. ఈ వింత ఘటన అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. #Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE — Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023 (చదవండి: ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!) -
బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి
ఎర్నాకులం : పని మీద బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా అద్దాల తలుపులకు(గ్లాస్ డోర్) తగిలి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేరళ, ఎర్నాకులంలోని పెరుంబవూర్‌కు చెందిన బీనా (46) పనిమీద సోమవారం నగరంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుకు వెళ్లారు. అక్కడ లావాదేవీలు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. వాహనం కీని మర్చిపోవడంతో దానికి తీసుకునేందకు మళ్లీ ఆమె బ్యాంకులోకి వెళ్లారు. కీని తీసుకొని తిరిగివెళ్లే క్రమంలో అనుకోకుండా ఆమె గ్లాస్ డోర్‌కు తగిలారు. దీంతో ఆ గ్లాస్ డోర్ పగిలి పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపులో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్త్రావం కావడంతో బ్యాంకు సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎర్నాకులం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అయ్యో..! ఈ అమ్మాయికి ఎంత కష్టం
బీజింగ్: చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఘటన ఇది. అక్కడి మొజియాంగ్ కౌంటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాలలో చదువుతున్న ఓ పదమూడేళ్ల బాలిక తల గ్లాస్ డోర్ల మధ్యలో ఇలా చిక్కుకుపోయింది. స్కూల్ క్యాంటీన్లో ఆడుకుంటున్న సమయంలో కొందరు మిత్రులు ఆ బాలిక తలను ఇలా గ్లాస్ డోర్ల మధ్యలో ఉంచారు. అయితే.. డోర్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలిక తల సులభంగా బయటకు రాలేదు. బాలికను రక్షించడానికి ఫైర్ సిబ్బంది రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. వారు డోర్ హ్యండిల్స్ను తొలగించడంతో ఆ బాలికను రక్షించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని రక్షించేవరకు కొన్ని గంటలపాటు ఆ బాలిక ఇలా నుంచోనే ఉంది. ఈ ఘటనలో ఆ బాలిక మెడకు స్వల్పంగా గాయాలయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని.. ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదని వారు వెల్లడించారు.