Viral Video: Tractor Starts On Its Own And Rams Into UP Shop - Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్‌ అయిన ట్రాక్టర్‌!ఆ తర్వాత..

Published Sat, Mar 4 2023 9:30 AM | Last Updated on Sat, Mar 4 2023 3:22 PM

Virla Video: Tractor Starting On Its Own And Rams Into UP Shop - Sakshi

ఏదో మిరాకిల్‌ లేక ఏదైనా దెయ్యమా! తెలియదుగానీ ఒక్కసారిగా ట్రాక్టర్‌ దానికదే స్టార్ట్‌ అయ్యింది. అదీకూడా పట్టపగలే అలా జరగడంతో.. ఒక్కసారిగా అక్కడున్న వారికెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ భయానక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..బిజ్నోర్‌లోని చెప్పులకు సంబంధించిన చైనా షాపు ఉంది దానికి సమీపంలో ఓ టాక్టర్‌ పార్క్‌ చేసి ఉంది. ఏమైందో ఏమో! హఠాత్తుగా ఆ ట్రాక్టర్‌ దానికదే స్టార్ట్‌్‌ అయ్యి ఆ చెప్పుల షాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆ షాప్‌లోని ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ..బయటకు వచ్చేశారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రాక్టర్‌ ఇంజన్‌ని ఆపి పెద్ద మొత్తంలో షాప్‌కి డ్యామేజ్‌ జరగకుండా కాపాడాడు. ఈ ఘటనలో ఆ షాపు అద్ధం మొత్తం పగిలిపోయి కొద్ది మొత్తంలో ఆ షాపు ఓనర్‌కి మాత్రం నష్టం వాటిల్లింది. దీంతో ఆ షాపు ఓనర్‌ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ ట్రాక్టర్‌ యజమానిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు

ఐతే స్థానికుల సమాచారం ప్రకారం..రాబోయే హోలీ పండుగ కోసం పోలీసులు బిజ్నోర్‌ పోలీస్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆ ట్రాక్టర్‌ యజమాని కిషన్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు. అతను తన ట్రాక్టర్‌ని ఈ చైనా చెప్పుల దుకాణం వద్ద పార్క్‌ చేశాడు. సుమారు గంట తర్వాత ఆగి ఉన్న ట్రాక్టర్‌ దానంతటే అదే స్టార్ట్‌ అయ్యి చెప్పుల దుకాణంలోకి వచ్చేయడంతో..ఆషాపు అద్దం మొత్త పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంతో.. ఈ వింత ఘటన అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. 

(చదవండి: ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement