
సాక్షి, హైదరాబాద్: గతేడాదిలో పోలిస్తే హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయనిక్కడ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయని.. రాబోయే కాలంలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది సైబర్ క్రైం మాత్రం పెరిగిందన్నారు. ట్రాఫిక్ చలాన్ల కింద రూ. 24 కోట్లు వసూలు చేశామని తెలిపారు. 100 నంబర్‌కు కాల్ వచ్చిన నిమిషాల్లోనే సిబ్బంది స్పందిస్తున్నారన్నారు. మరో వైపు నగరంలో సంచలనం సృష్టించిన పలు కేసులు చేధించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment