తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడిని ఒప్పుకోని ప్రజలు
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన వైనం
ఆయన తీరుపై సర్వత్రా నిరసన
టీడీపీ సామాజిక వర్గ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి
డబ్బులు ఆశ చూపి ప్రలోభాలకు తెర
చీప్ ట్రిక్స్‌ను తిప్పికొడుతున్న ఓటర్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దురుసు స్వభావం, అహంకారపూరిత ధోరణి ఓటర్లను మరింత దూరం చేస్తోంది. గతంలో ఆయన ట్రాక్ రికార్డు సైతం ప్రజల్లో భయందోళన రేకెత్తిస్తోంది. దీంతో పారీ్టల కతీతంగా సామాన్య ఓటర్లు సైతం ఈయనను ఎమ్మెల్యేగా భరించగలమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ సామాజికవర్గ నేతలు సైతం కొలికపూడి విషయంలో కినుకు వహిస్తున్నారు. కొలికపూడి సైతం వారిని కలుపుకొనిపోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతోంది. దీంతో చివరి అస్త్రంలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలను సైతం పసిగట్టిన ఓటర్లు తిప్పికొడుతుండటంతో ఆయన విలవిల్లాడుతున్నాడు. ప్రతి సారీ ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలను తెచ్చి తమవైపు రుద్దుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, చినబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.
హంగామా చేసి...
టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అందోళన చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఏకొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా, గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావిడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తరువాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి.
పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు. ఇలా కొలికిపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గంపలగూడెం మండలం మంచిరాలపాడులో కొలికపూడికి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఆయన ప్రచారంలో భాగంగా నోటి దురుసుతో సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి.. అని అనగానే అక్కడ ఉన్న మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు. ఫ్యానుకే మా ఓటు అంటూ మహిళలు చేతులు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. ఊహంచని పరిణామం నుంచి వెంటనే తేరుకొని ఇంకా అక్కడ ఉంటే మహిళల నుంచి పరాభవం తప్పదని గ్రహించి రోడ్‌షో చేయకుండానే జారుకున్నాడు.
ప్రలోభాలకు తెర..
ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనే భావనకు వచ్చిన కొలికపూడి ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలల్లో తొలుత హోలి కానుకల పేరుతో మభ్యపెట్టే యత్నం చేశారు. పలు సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి రకరకాల హామీలు గుప్పించారు. స్థలాలు కొని, సామాజిక భవన నిర్మాణాలు చేపడతానని మభ్య పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికల తరువాత చూస్తానని నాలుక మడతేశారు. పదో తరగతిలో 500 కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు పారితోíÙకం ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామని చెబుతున్నాడు. ప్రచారంలో సైతం జనాలు లేకపోవడంతో, ఆ గ్రామాల్లో అద్దె మనుషులను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీలోని నేతలే పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment