మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.