ORR Speed Limit Increased To 120 kmph From 100 kmph - Sakshi
Sakshi News home page

వాహనాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఓఆర్‌ఆర్‌పై మరింత వేగంతో దూసుకెళ్లొచ్చు

Published Tue, Jun 27 2023 5:49 PM | Last Updated on Tue, Jun 27 2023 6:34 PM

ORR Speed Limit Increased To 120 kmph From 100 kmph - Sakshi

సాక్షి, మైదరాబాద్‌: హైదరాబాద్  చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా దానిని120కి పెంచాలని నిర్ణయించింది.

మేరకు పురపాలక, ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇచ్చారు.  ఈ మేరకు హెచ్‌ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది.

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120కి.మీకి పెంచుతున్నట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే స్పీడ్‌ లిమిట్‌ పెంచిన నేపథ్యంలో వాహనాదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏను ఆదేశించారని అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. ఓఆర్‌ఆర్‌ (కోకాపేట నుంచి ఘట్‌కేసర్‌ వరకు, తారామతిపేట – నానక్‌రామ్‌గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్‌ చేయాలని హెచ్‌ఎండీఏ సూచించింది.

చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్‌ ఓవైసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement