సాక్షి, మేడ్చల్: ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బుధవారం ఉదయం రోడ్డుపైన పల్టీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీరామరాజు తలకు గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment