
రాఘవేందర్(ఫైల్)
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు, ముందున్న లారీ కిందకు దూసుకెళ్లి వాహనాన్ని నడుపుతున్న ఎస్‌ఐ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున జరిగింది. మహబూ బ్‌నగర్ జిల్లా ధర్మ పూర్ గ్రామానికి చెందిన పల్లె మాస య్యగౌడ్ కుమారుడు పల్లె రాఘవేందర్ (37) రైల్వే ఎస్‌ఐగా పని చేస్తు న్నారు.
శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూ రులోని బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టులో నివసించే స్నే హితుడు బాబురెడ్డిని కలిసేందుకు మహబూబ్‌నగర్ నుంచి తన స్విప్ట్ డిజైర్ కారులో బయ లుదేరారు. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న ఎస్‌ఐ రాఘవేందర్ తన కారును నియంత్రించ లేకపోవ డంతో ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.
Comments
Please login to add a commentAdd a comment