సాక్షి, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: హెచ్‌ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు!
Comments
Please login to add a commentAdd a comment