వరంగల్ అర్బన్: చారిత్ర ఓరుగల్లుకు మహర్దశ పట్టనుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. 69 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ ఓఆర్‌ఆర్ రెండు జాతీయ, 4 రాష్ట్ర రహదారులతో పాటు అనేక దారులను కలుపుతోంది. హైదరాబాద్–భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఓఆర్‌ఆర్‌లో 29 కి.మీ. పొడవున ఫోర్ లేన్ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి అనుసంధానంగా కమర్షియల్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, గ్రీన్‌బెల్ట్, హెరిటేజ్, విద్యా భవనాల జోన్లు ప్రత్యేకంగా అభివృద్ధి చేసేలా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాలు పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి ఊపందుకోనుంది.
69 కి.మీ... మూడు భాగాలు: ఔటర్ రింగ్ రోడ్డును 3 భాగాలు విభజించారు. 69 కి.మీ. నిడివిలో 51 కి.మీ.ల్లో 4 లేన్ల రోడ్డు ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ రెండు విభాగాలుగా అభివృద్ధి చేస్తోంది. మరో 18 కి.మీ.ను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఎన్‌హెచ్ 163లో రాయగిరి–ఆరేపల్లి దాకా 99 కి.మీ.ను రూ.1,905 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది. వరంగల్ ఓఆర్‌ఆర్‌లో 29 కి.మీ. మేరకు దీని పరిధిలోకి నిర్మాణం కానుంది. దీ నికి ఇప్పటికే భూ సేకరణ పూరై్త.. కల్వర్టు, బ్రిడ్జిల నిర్మాణం సాగుతోంది. ఈ రోడ్డు హైదరాబాద్–వరంగల్ మార్గంలో రాంపూర్ గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, కోమటిపల్లి, భీమారం, చింతగట్టు, పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి, వంగపహాడ్, ఆరేపల్లి దాకా ఉంటుంది.
జగిత్యాల నుంచి కరీంనగర్, వరంగల్ మీదుగా సూర్యాపేట వరకు జాతీ య రహదారి (563)గా కేంద్రం అభివృద్ధి చేయనుంది. దీంతో ములుగు రోడ్డులోని దామెర క్రాస్ రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డులోని సింగారం వరకు 22 కి.మీ. అభివృద్ధి చే యనుంది. ములుగురోడ్డు, కొత్తపేట, మొగి లిచర్ల, బొడ్డు చింతలపల్లి, కోట వెంకటాపురం, మామూనూర్ ఎయిర్‌పోర్టు సమీపం నుంచి సింగారం వరకు ఓఆర్‌ఆర్‌ను కేంద్రం అభివృద్ధి చేయనుంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో 18 కి. మీ.
హైదరాబాద్–భూపాలపట్నం ఎన్‌హెచ్163లో వరంగ ల్ అర్బన్ జిల్లా పరిధిలోని రాంపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి సింగారం వరకు 18 కి.మీ. మేర ఫోర్ లేన్ రోడ్డు అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. దీనికి రూ.699 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పనులకు సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment