(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై నిన్న ఆత్మహత్యకు యత్నించిన యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పాయింట్ బ్లాక్‌లో గన్ ఫైర్ కావడంతో బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయింది. కోమాలోకి వెళ్లిపోయన ఫైజన్‌ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చదవండి: కారులో కణతపై కాల్చుకొని...
ఉస్మానియా మార్చరీకి మృతదేహం
మరోవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ రమణ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. మృతుడు రూ.2కోట్ల 50 లక్షల బాకీ ఉన్నట్లు నిన్న నలుగురు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment