Faizan
-
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
కారులో కణతపై కాల్చుకొన్న ఫైజన్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నిన్న ఆత్మహత్యకు యత్నించిన యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పాయింట్ బ్లాక్‌లో గన్ ఫైర్ కావడంతో బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయింది. కోమాలోకి వెళ్లిపోయన ఫైజన్‌ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చదవండి: కారులో కణతపై కాల్చుకొని... ఉస్మానియా మార్చరీకి మృతదేహం మరోవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నార్సింగ్ ఇన్స్పెక్టర్ రమణ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. మృతుడు రూ.2కోట్ల 50 లక్షల బాకీ ఉన్నట్లు నిన్న నలుగురు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
ఫోన్లో తలాక్ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్
భోపాల్: మెసేజ్‌లు, వాట్సప్ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఫోన్ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి.. మైనర్ అయిన భార్య మేనకోడలితో లేచిపోయాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భోపాల్‌కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ వెళ్లాడు. ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాన్పూర్ వెళ్లేముందు ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరాడు. కాగా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. పెట్రోలింగ్ చేస్తున్న రైల్వే పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్, మైనర్ బాలికను కస్టడీలోకి తీసుకుని విచారించారు. భోపాల్ పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరినీ భోపాల్ పంపించారు. ఫైజాన్ భార్యను ఒప్పించి, తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, కాన్పూర్ వెళ్లాక ఫోన్లో విడాకులు ఇస్తున్నట్టు భార్యకు చెప్పాడని మైనర్ బాలిక పోలీసుల విచారణలో చెప్పింది. ఫైజాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో అతని భార్యను కూడా విచారిస్తామని చెప్పారు.