ఫోన్‌లో తలాక్‌ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్‌ | Man Divorces Wife Over Phone to Elope With Her Minor Niece, Held | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో తలాక్‌ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్‌

Published Thu, Apr 13 2017 3:06 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

ఫోన్‌లో తలాక్‌ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్‌ - Sakshi

ఫోన్‌లో తలాక్‌ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్‌

భోపాల్: మెసేజ్‌లు, వాట్సప్‌ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్‌ చెప్పేసి విడాకులు ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఫోన్‌ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్‌ చెప్పి.. మైనర్ అయిన భార్య మేనకోడలితో లేచిపోయాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

భోపాల్‌కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్‌ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ వెళ్లాడు.

ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాన్పూర్ వెళ్లేముందు ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్‌ చేసి తాను పెళ్లి చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరాడు. కాగా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. పెట్రోలింగ్ చేస్తున్న రైల్వే పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్, మైనర్ బాలికను కస్టడీలోకి తీసుకుని విచారించారు. భోపాల్ పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరినీ భోపాల్ పంపించారు. ఫైజాన్ భార్యను ఒప్పించి, తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, కాన్పూర్ వెళ్లాక ఫోన్‌లో విడాకులు ఇస్తున్నట్టు భార్యకు చెప్పాడని మైనర్ బాలిక పోలీసుల విచారణలో చెప్పింది. ఫైజాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో అతని భార్యను కూడా విచారిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement