ఔటర్‌పై కారు దగ్ధం ఒకరు సజీవ దహనం | Car Suddenly Caught Fire On Road In Rangareddy District | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై కారు దగ్ధం ఒకరు సజీవ దహనం

Published Sun, Sep 19 2021 1:29 AM | Last Updated on Sun, Sep 19 2021 7:42 AM

Car Suddenly Caught Fire On Road In Rangareddy District - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి డ్రైవింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్‌ రింగు రోడ్డుపై శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న హోండా అమేజ్‌ (ఏపీ27–సీ0206) కారు నానక్‌రాంగూడ టోల్‌గేటు వద్ద రాత్రి 7.09 గంటలకు ప్రవే శించింది.

అక్కడి నుంచి శంషాబాద్‌ మీదుగా పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే కారులో మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న వ్యక్తి కారును రోడ్డు పక్కకు పార్కు చేసేలోపే మంటలు పూర్తిగా వ్యాపించడంతో సజీవ దహనం అయ్యాడు. ఘటన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియరాలే దు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement