
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వలిమెల ఔటర్ రింగ్ రోడ్‌పై వృద్ధ దంపతుల మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. గత ఐదు రోజులగా కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నా మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. మృతుల సంబంధీకుల కోసం విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత ఐదు రోజులుగా వృద్ధుల మృతదేహాలు పటన్‌చెరు ఆస్పత్రిలోనే ఉన్నాయి. అయితే మృతులది హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని.. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment