హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో రూ.100 కోట్లతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్‌ను ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న సైకిల్ ట్రాక్ తరహాలో దేశంలోనే ఆ స్థాయిలో తొలి సైకిల్ ట్రాక్‌ను నగరంలో ఏర్పాటు చేయడం విశేషం.
కొల్లూరు నుంచి నార్సింగి వరకూ, నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకూ మొత్తం 23 కి.మీ మార్గంలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్ పొడవునా సోలార్ రూఫ్ టాప్ సైతం ఏర్పాటు చేశారు. సోలార్ పలకల నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను ట్రాక్ అవసరాల కోసం వినియోగిస్తారు. ట్రాక్ పొడవునా అద్దె సైకిళ్లు, సైకిల్ రిపేరింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పారు. రైడర్లు విశ్రాంతి తీసుకునేందుకు కెఫెటేరియా వంటి వసతులు కూడా అందుబాటులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment