sadiq
-
పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా సాదిక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్)(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)మరికొన్ని పారీ్టలతో ఏర్పడిన సంకీర్ణ కూటమిలో పదవుల పంపిణీ కొలిక్కి వస్తోంది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవికి శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో పీఎంఎల్–ఎన్ సీనియర్ నేత సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్‌గా పీపీపీ నేత గులాం ముస్తాఫాషా ఎన్నికయ్యారు. అయాజ్ సాదిక్‌కు 291 ఓట్లకు గాను 199 ఓట్లు రాగా, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ బలపరిచిన అమిర్ డోగార్‌కు 91ఓట్లు దక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పారీ్టకి చెందిన ప్రజాప్రతినిధులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్లో చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్–ఎన్ బలపరిచిన అభ్యర్థి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
‘వన్ డే కొత్వాల్’ సాదిఖ్ ఇకలేడు
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయసులో హైదరాబాద్ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్‌గా పని చేసిన బాలుడు సాదిఖ్ బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్‌తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్ బాషా తెలిపారు. సాదిఖ్‌కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్ 15న సాదిఖ్‌ను హైదరాబాద్ నగరానికి ఒక రోజు కమిషనర్‌గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి నుంచి సాదిఖ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సాదిఖ్ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్ బాషా అన్నారు. -
సాదిక్‌ను నగరానికి తీసుకొస్తాం
► ఆయన తండ్రికి విదేశాంగ శాఖ లేఖ ► ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో యువకుడి నరకయాతన ► ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం కానరాని దేశం వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏజెంట్ల మోసానికి బలై సౌదీ ఎడారిలో అష్టకష్టాలు పడుతున్న సాదిక్ అనే హైదరాబాద్ యువకుడిని నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘అలా ఉన్నాడు...ఇలా అయ్యాడు’ అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించారు. సాదిక్‌ను నగరానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని అతడి తండ్రి అలీయోద్దీన్కు విదేశాంగ కార్యాలయం అధికారులు లేఖ రాశారు. సాదిక్ ఉపాధి నిమిత్తం స్థానిక ఏజెంట్ అర్షద్, ముంబైలోని రాజు అనే ఏజెంట్ సాయంతో గత ఏడాది జూన్ 23న సౌదీకి వెళ్లాడు. తీరా వెళ్లాక ఏజెంట్లు హామీ ఇచ్చిన తోటమాలి పని కాకుండా అబా నగరంలో ఒంటెలు, మేకలకు కాపలా కాసే పనిలో పెట్టారు. అయితే, ఖఫీల్(యజమాని) అన్నపానీయాలు కూడా సరిగా ఇవ్వడంలేదు. 11 నెలలపాటు జీతం ఇవ్వలే దు. సౌదీ ఎడారిలో నరకం అనుభవించాడు. అతని దీనస్థితిని చూసిన అక్కడి హైదరాబాద్ యువకులు యజమాని చెర నుంచి పారిపోవడానికి సహకరించారు. ప్రస్తుతం సాదిక్ రియాద్ సమీపంలోని ఉన్నట్లు అలీయోద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని రెయిన్‌బజార్ పోలీసులను, ముంబైలోని అంధేరీ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరకు ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తన కొడుకును సౌదీ ఖఫీల్ బంధీఖానా నుంచి రక్షించాలని భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు ఉత్తరం రాశారు. ‘సాదిక్ సౌదీ నుంచి నగరానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటాం’ అంటూ సాదిక్ తండ్రికి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. మరోవైపు రియాద్‌లో ఉన్న హైదరాబాద్ యువకులు భారత కాన్సులేట్‌కు సాదిక్ వ్యవహారం తెలియజేశారు. దీంతో సౌదీ కాన్సులేట్ వారు సాదిక్ ఖఫీల్‌కు ఫోన్ చేసి రియాద్‌కు రావాలని కోరగా వారం రోజుల్లో వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
రుణదాతల నుంచి తప్పించుకోబోయి..
రుణదాతలు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. అచ్చం సినీ ఫక్కీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పాతబస్తీకి చెందిన అసద్, సాదిక్ బార్కాస్ నుంచి మెహదీపట్నవైపు వెళ్తున్నారు. దుర్గానగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే వారిని చూసిన ఇద్దరు రుణదాతలు బైక్‌పై వెంబడించారు. దీంతో బైక్ వేగాన్ని పెంచిన యువకులు బాబుల్‌రెడ్డినగర్ గ్రాండ్ ఫంక్షన్‌హాల్ ముందు యూటర్న్ చేయబోతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ లారి కింద కు వెళ్లింది. కాగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. -
'సాధిక్ హత్యతో మాకు సంబంధం లేదు'
హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాధిక్ హత్య కేసుతో తమకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ జిల్లా ఎస్పీని కలసి ఈ మేరకు విన్నవించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కోరారు. గురువారం గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో సాధిక్‌ను నరికారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.