హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాధిక్ హత్య కేసుతో తమకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ జిల్లా ఎస్పీని కలసి ఈ మేరకు విన్నవించారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కోరారు. గురువారం గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో సాధిక్ను నరికారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
'సాధిక్ హత్యతో మాకు సంబంధం లేదు'
Published Fri, Oct 24 2014 6:52 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement