మేమంతా ఇక్కడి వారమే... | muslims all are indians, says Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

మేమంతా ఇక్కడి వారమే...

Published Sat, Jul 26 2014 3:32 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

మేమంతా ఇక్కడి వారమే... - Sakshi

మేమంతా ఇక్కడి వారమే...

* పాకిస్థానీయులు అనడం సరైంది కాదు
* గాజాపై ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టాలి
* హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ

 
 హైదరాబాద్: ‘మేమంతా ఇక్కడి వారమే... మమ్మల్ని పాకిస్థానీయులు అనడం సరైంది కాదు... అసద్ పాకిస్థాన్‌కు వెళ్లూ అంటున్నారు బీజేపీ వారు... మా తాత ముత్తాతలు ఇక్కడి వారే... నేనెందుకు పాకిస్థాన్‌కు వెళ్తాను... ఈ దేశం బీజేపీ వారి జాగీరా... హమారా బాప్, దాదేకా జాగీర్ హై... అప్పట్లో పాకిస్థాన్‌కు వెళ్లిన వారు వెళ్లిపోయారు... ఉన్న వాళ్లంతా ఇక్కడి వారే... ముస్లింలపై కామెంట్ చేస్తున్న బీజేపీ ఎంపీలందరికి ట్రైనింగ్ ఇవ్వూ ప్రధాని నరేంద్ర మోడీ’... అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ, శివసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.         
 
 రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని మక్కా మసీదులో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో యౌముల్ ఖురాన్ పఠన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ... పార్లమెంటులో తానెప్పుడు లేచి మాట్లాడానికి ప్రయత్నించినా బీజేపీ ఎంపీలు అడ్డుకొని ఏ పాకిస్థానీ బైఠో...(ఓ పాకిస్థానీ కూర్చో) అంటూ వెటకారం చేస్తారని... అందుకే వారికి కనువిప్పు కలిగే విధంగా జవాబు ఇస్తానన్నారు. అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోందని... దీనిని ప్రతి ముస్లిం ఖండించాల్సిన అవసరముందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement