పాకిస్తాన్‌కు భారీ ఆధిక్యం  | Pakistan has a huge lead | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు భారీ ఆధిక్యం 

Published Sat, May 26 2018 1:04 AM | Last Updated on Sat, May 26 2018 1:04 AM

Pakistan has a huge lead - Sakshi

లండన్‌: బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. నలుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకాలు నమోదు చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ 8 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్న పాక్‌ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 50/1తో శుక్రవారం ఆట కొనసాగించిన పాక్‌కు హారిస్‌ సోహైల్‌ (39; 5 ఫోర్లు), అజహర్‌ అలీ (50; 6 ఫోర్లు), అసద్‌ షఫీక్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (68 రిటైర్డ్‌ హర్ట్‌; 10 ఫోర్లు) షాదాబ్‌ ఖాన్‌ (52; 6 ఫోర్లు), ఫహీమ్‌ అష్రఫ్‌ (37; 7 ఫోర్లు) భారీ స్కోరు అందించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement