జోర్డాన్: సిరియాలో తిరుగుబాటుదారుల మొహమ్మద్ అల్ బషీర్ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఆంటోని బ్లింకెన్ జోర్డాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరియాతో కొత్త ప్రభుత్వంతో బైడెన్ టచ్‌లో ఉన్నారు. బషీర్ ప్రభుత్వం సహా ఇతర పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్దంగా ఉంది. పాలనలో బషీర్ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
మరోవైపు.. జోర్డాన్ విదేశాంగ మంత్రి అమాన్ సఫాది మాట్లాడుతూ.. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం మాకు ఇష్టం లేదు. బషీర్ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్.. దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్ సిరియాను వదిలివెళ్లిన తర్వాత అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం, తిరుగుబాటుదారుల మద్దతుతో అల్ బషీర్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment