T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు... | T20 WC: PNG Cricketers Support Staff Break Down During National Anthem | Sakshi
Sakshi News home page

T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు...

Published Sun, Oct 17 2021 5:36 PM | Last Updated on Wed, Oct 20 2021 4:48 PM

T20 WC: PNG Cricketers Support Staff Break Down During National Anthem - Sakshi

(Photo Source: Disney + Hotstar)

PNG cricketers, support staff break down; ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన ఆ జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది... ఏళ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కళ్లు చెమర్చాయి. క్రికెట్‌ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ సందర్భంగా... ఈ ఈవెంట్‌కు తొలిసారిగా అర్హత సాధించిన పపువా న్యూగినియా జట్టు, సిబ్బంది గురించే ఈ ప్రస్తావన.

గ్రూపు-బీలో ఉన్న పపువా న్యూగినియా.. ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఆతిథ్య ఒమన్‌తో మ్యాచ్‌ ఆడుతోంది. ఈ క్రమంలో తొలుత పపువా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దీంతో... ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. 

కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఒమన్‌...  పపువాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్‌ అసద్‌ వాలా(56) టోర్నీలో మొదటి అర్ధ శతకం సాధించడం విశేషం.

చదవండి: T20 World Cup 2021 : ఒమన్‌ జట్టులో హైదరాబాదీ క్రికెటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement