జూలియా సయూద్ సిరియాకు చెందిన యువతి. ఆమెకు పెయింటింగ్స్ అంటే ప్రాణం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జూలియా తన ఇంటిని వదిలి బయటకు రావల్సివచ్చింది. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కిట్‌ను అక్కడే వదిలేసింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందంటే.. తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్స్‌ను ఆపడం ఇష్టం లేని ఆ యువతి.. కలర్స్ లేకపోయనా తన కళను కొనసాగించాలనుకుంది.
అందుకోసం ఆమె ఓ కొత్త ఐడియా ఆలోచించింది. అదే.. కలర్స్ బదులుగా మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్‌ను వేయాలని నిర్ణయించుకుంది. అలా మొదలు పెట్టిన జూలియా ప్రస్తుతం ఆ మట్టి పెయింటింగ్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అప్పుడు మట్టితో పెయింటింగ్స్ వేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనుకున్నా. మొదట, నేను నా కలను కొనసాగించాలని ఆలోచనతో అలా మట్టితో మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు వేరే మార్గం లేదు .. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోందని తెలిపింది.
మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తన వేసిన సాయిల్ పెయింటింగ్స్ ఆ ప్రాంతంలో ట్రెండ్‌గా మారడంతో పాటు ఆ పరిసరాల్లోని పిల్లలకు కూడా ఈ మట్టితో పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నారు.
WATCH: Syrian artist Julia Saeed started painting with soil after she fled her home in Raqqa and could not afford to buy paint. Now she has made painting with soil her unique style pic.twitter.com/JsE64Imai5
— Reuters (@Reuters) October 10, 2021
Comments
Please login to add a commentAdd a comment