బంధువుతో పెళ్లి వద్దన్నందుకు.. కాల్చి చంపిన కుటుంబ సభ్యులు | Syrian: Girl Assassinated By Her Family After Refusing To Marry Her Cousin | Sakshi
Sakshi News home page

బంధువుతో పెళ్లి వద్దన్నందుకు.. కాల్చి చంపిన కుటుంబ సభ్యులు

Published Wed, Jul 7 2021 4:01 PM | Last Updated on Wed, Jul 7 2021 4:45 PM

Syrian: Girl Assassinated By Her Family After Refusing To Marry Her Cousin - Sakshi

సిరియా: బంధువును వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు అల్ హసకా గవర్నరేట్ ప్రాంతానికి చెందిన సిరియా మైనర్‌ బాలికను కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. వివరాల్లో​కి వెళితే.. ఓ 13-16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికను తమ బంధువుకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఆమె వేరొకరిని ప్రేమించడంతో పెళ్లికి నిరాకరించింది.

దీంతో ఓ 10 మందికి పైగా యువకులు అమ్మాయిని ఆటోమేటిక్‌ రైఫిల్స్‌తో హత్య చేశారు. అయితే ఈ ఘటనపై తూర్పు సిరియాలో భద్రతా అధికారులు అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కానీ, ఈశాన్య సిరియాలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ రైట్స్‌ భద్రతా అధికారులు ఈ నేరం జరిగినట్లు ధృవీకరించారు. ఇక బాధితురాలి తండ్రి, సోదరులు, బంధువులు ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై సిరియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement