న్యూయార్క్: సిరియాలో జరిగిన దాడుల్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ కీలక నేతను హతమార్చినట్లు అమెరికా మిలిటరీ వెల్లడించింది. అల్ ఖైదా కీలక నేత అబూ అబ్దుల్ రెహ్మాన్ అల్ మక్కీని టార్గెట్ చేసి దాడి చేశామని, ఈ దాడుల్లో ఆయన మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM)సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. రెహ్మాన్ అల్ మక్కీ.. హుర్రాస్ అల్-దిన్ షురా కౌన్సిల్ సభ్యుడు, సిరియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
U.S. Central Command Forces Killed Hurras al-Din Senior Leader
Earlier today, U.S. Central Command Forces killed Hurras al-Din senior leader Abu-’Abd al-Rahman al-Makki in a targeted kinetic strike in Syria. Abu-’Abd al-Rahman al-Makki was a Hurras al-Din Shura Council member… pic.twitter.com/eIxqqU1vFq— U.S. Central Command (@CENTCOM) August 23, 2024
హుర్రాస్ అల్-దిన్ సిరియాలో ఉన్న అల్-ఖైదా అనుబంధ గ్రూప్ అని అమెరికా తెలిపింది. అమెరికా, పాశ్చాత్య దేశాలే లక్ష్యంగా నిర్వహించటంలో అల్ ఖైదాకు ఈ గ్రూప్ సహాయం చేస్తోందని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను అంతం చేయటం కోసం అంతర్జాతీయంగా ఏర్పాటైన సైన్యంలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారని తెలిపింది. ఇరాక్, సిరియాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న అల్-ఖైదా గ్రూప్‌ను ఎదుర్కోవడం కోసం ఈ సైన్యం 2014లో స్థాపింపించారు.
Comments
Please login to add a commentAdd a comment