పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అతలాకులతమవుతోంది. గాజాస్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’ పేరుతో మెరుపు దాడి చేపట్టింది. కేవలం 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లతో విరుచుపడింది. హమాస్ విధ్వంసానికి దిగడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
హమాస్ ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటూ గాజాపై బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతోంది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. గత అయిదు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3000 మంది మరణించారు.
చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
తాజాగా ఇజ్రాయెల్‌కు మరో ముప్పు పొంచుకొచ్చింది. హమాస్‌తోపాటు లెబనాన్, సిరియా రెండు దేశాల నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకున్న హమాస్ ఉగ్రవాద దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని షియా ఇస్లామిస్ట్ గ్రూప్ హిజ్బుల్లాతో కూడిన ప్రాంతీయ కూటమి.. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్‌తో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలో హమాస్ దాడికి కొన్ని రోజులకే లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ ట్యాంక్‌పై గైడెడ్ క్షిపణిని ప్రయోగించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ దాడికి పాల్పడించింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా తమ ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయలేరని హిజ్బుల్లా హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. దీని తర్వాత లెబనాస్- ఇజ్రాయెల్ సరిహద్దులో హింస అత్యంత తీవ్రంగా మారిది. కాగా ఇస్లామిక్ విప్లవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇజ్రాయెల్ దళాలతో పోరాడటానికి హిజ్బుల్లాను 1982లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థాపించారు.
మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. సిరియా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక దాడులు జరుగుతున్నట్లు సైన్యం చెబుతోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్ షెల్స్, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 1967లో ఆరు రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాలు మధ్య వైరుద్ధం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment