సిరియా చేతిలో 0–3తో ఓటమి
ఒక్క గోల్ కొట్టకుండానే టోర్నీని ముగించిన టీమిండియా
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత సిరియా
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది.
సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది.
భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు.
సమష్టి వైఫల్యం...
ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్‌లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్‌ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది.
తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు.
రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది.
Comments
Please login to add a commentAdd a comment