ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌: సిరియా ఘనవిజయం | Syria won the Intercontinental Cup | Sakshi
Sakshi News home page

ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌: సిరియా ఘనవిజయం

Sep 7 2024 2:19 AM | Updated on Sep 7 2024 2:19 AM

Syria won the Intercontinental Cup

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో సిరియా 2–0తో మారిషస్‌పై ఘన విజయం సాధించింది. ఈ పరాజయంతో మారిషస్‌ టోర్నమెంట్‌ నుంచి ఎలిమినేట్‌ కాగా... సోమవారం జరిగే ఆఖరి పోరులో ఆతిథ్య భారత్‌తో సిరియా తలపడుతుంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిరియా ఫుట్‌బాలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టు సంపాదించారు. 

పదేపదే ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా దాడులకు పదునుపెట్టారు. కానీ ప్రత్యర్థి డిఫెండర్‌ బ్రెండన్‌ సిటొరా చేసిన తప్పిదంతో సిరియా ఖాతా తెరిచింది. ఆట 32వ నిమిషంలో సిటోరా సెల్ఫ్‌గోల్‌తో సిరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

తర్వాత రెండో అర్ధభాగంలో అల్‌ మవాస్‌ (70వ నిమిషంలో) సాధించిన గోల్‌తో సిరియా ఆధిక్యం (2–0) రెట్టింపైంది. మరోవైపు మారిషస్‌ కూడా రెండో సగంలో గోల్‌ కోసం చేసిన ప్రయత్నాల్ని సిరియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement