సిరియాలో దాడి: 40 మంది మృతి | 40 Members Died In Syria Attack | Sakshi
Sakshi News home page

సిరియాలో దాడి: 40 మంది మృతి

Published Wed, Apr 29 2020 2:39 AM | Last Updated on Wed, Apr 29 2020 2:40 AM

40 Members Died In Syria Attack - Sakshi

అంకారా: సిరియాలో టర్కీ అనుకూల దళాల నియంత్రణలో ఉన్న ఆఫ్రిన్‌ పట్టణంలో తిరుగుబాటుదారులు చేసిన దాడిలో 40 మంది పౌరులు చనిపోయారు. రద్దీగా ఉన్న వీధిలో ఒక చమురు ట్యాంకర్‌ను పేల్చి ఈ దాడికి పాల్పడ్డారని టర్కీ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో 11 మంది చిన్నారులున్నారని చెప్పారు. ఈ దాడిలో మరో 47 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఈ దాడి సిరియన్‌ కుర్దిష్‌ తిరుగుబాటు దళాల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టర్కీ అధికార వార్తా సంస్థ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement